విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలకు వరుస సెలవులు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు ఈ వారంలో రెండు రోజులు మూతపడనున్నాయి.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు ఈ వారంలో రెండు రోజులు మూతపడనున్నాయి. 2025 ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. శుక్రవారం, శనివారం సెలవులు. ఈ సెలవుల్లో ఒకటి జనరల్ హాలీ డే కాగా.. మరొకటి ఆప్షనల్ హాలీ డే. శుక్రవారం‘వరలక్ష్మీ వ్రతం’ ఆప్షనల్ హాలీ డే. శనివారం ‘రాఖీ పూర్ణిమ’కి సెలవు.
ప్రస్తుత నెలలో పాఠశాలలకు మరో మూడు సాధారణ సెలవులు కూడా ఉన్నాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి:
స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
శ్రీ కృష్ణాష్టమి - ఆగస్టు 16
వినాయక చవితి - ఆగస్టు 27
ఈ నెలలో ప్రభుత్వం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు నాలుగు రోజులు సాధారణ సెలవులు, ఒక ఆప్షనల్ హాలీ డేను జాబితా చేసింది.