Telangana : నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు
నేటితో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. మొత్తం పన్నెండు రోజులు పుష్కరాలు జరిగాయి.
నేటితో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. మొత్తం పన్నెండు రోజులు పుష్కరాలు జరిగాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలజిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు రోజుకు లక్ష మంది భక్తులకు పైగానే ఈ పుష్కరాలకు హాజరయ్యారు.
పన్నెండు రోజుల పాటు...
పుష్కరాలకు శని, ఆదివారాల్లో ఎక్కువ మంది రావడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. పదుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఫలితం లేదు. నేడు చివరి రోజు కావడంతో పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. నేడు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పుష్కరాలకు హాజరు కానున్నారు. కల్వకుంట్ల కవిత కూడా పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానాలను చేయనున్నారు. కాళీశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.