Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం 44 వ జాతీయ రహదారి పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1:30 నిమిషాలకు సమయంలో హైదరాబాదు నుంచి కర్నూలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎం ను వెనకనుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 20 మంది కి తీవ్ర గాయాలయ్యాయి.
జాతీయ రహదారిపై...
క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేరవాహనాలునిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు.