ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటుపై సమీక్ష
దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది
komatireddy venkatareddy
దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది. అధికారులతో కలిసి ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించనున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ భవన్ ను నిర్మిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
వివాదాలున్నప్పటికీ...
రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర నుంచి అపరిష్కృతంగా ఉన్న ఏపీ భవన్ విభజన అంశాన్ని త్వరగా పరిష్కరించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అపరిష్కృతంగా వివాదం అన్న మాటకు ఆయన వివాదాన్ని పరిష్కరించి భవన్ ఆస్తులను పంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పుకొచ్చారు.