Revanth Reddy : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2026-01-17 02:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా నేడు ఆయన పాలమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరసగా జిల్లా కేంద్రాలను పర్యటిస్తున్నారు.

పలు అభివృద్ధి పనులకు...
నేడు మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ఐఐటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత జిల్లాలో పలు మున్సిపాలిటీలకు సంబంధించిన అభివృద్ధి పనులకు కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నేతలతో రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేసే అవకాశముంది.


Tags:    

Similar News