Revanth Reddy : నేడు ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ప్రధాని మోదీని ఈరోజు ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి కలిసి గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని కోరనున్నారు.
గ్లోబల్ సమ్మిట్ కు రావాలని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని కోరారు. ముఖ్యమంత్రి రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు కూడా ఉన్నారు.