Revanth Reddy : రేవంత్ సంచలన నిర్ణయం.. అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు

Update: 2025-10-22 11:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రవాణా చెక్ పోస్టులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ అమలులోకి రావడంతో రవాణా చెక్ పోస్టులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే ఇన్నాళ్లూ కొన్ని కారణాల వల్లనే ఈ చెక్ పోస్టులను ఉంచినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

అవినీతి పెరిగిపోవడంతో...
రవాణా చెక్ పోస్టులలో అవినీతి పెరిగిపోవడంతో కూడా ఈ చెక్ పోస్టులను మూసివేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇటీవల ఏసీబీ అధికారులు కూడా చెక్ పోస్టులపై దాడి చేశారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోగా రవాణా చెక్ పోస్టుల మూసివేతపై తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రవాణా చెక్ పోస్టులన్నింటినీ మూసివేసి, అందులో ఉన్న ఫర్నీచర్ ను ఆర్టీఏ కార్యాలయాకు తరలించాలని, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేరే బాధ్యతను ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.


Tags:    

Similar News