Revanth Reddy : నేడు అధికారులతో రేవంత్ సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో పాల్గొననున్నారు

Update: 2026-02-28 03:20 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు. వివిధ శాఖల్లో జరుగుతున్న నిర్ణయాలు, వాటి అమలుపై కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కార్యదర్శులకు పథకాల అమలు, అభివృద్ధి పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.

99 రోజుల యాక్షన్ ప్లాన్ పై...
అలాగే ఈరోజు మధ్యాహ్నం సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 99 యాక్షన్ ప్లాన్ ను అధికారుల ముందు ఉంచి వాటి అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించనున్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పనుల పురోగతిపై కూడా ఆరా తీయనున్నారు.


Tags:    

Similar News