BJP : నేడు కామారెడ్డిలో బీజేపీఎల్పీ సమావేశం

ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం కామారెడ్డిలో జరగనుంది

Update: 2026-02-28 06:20 GMT

ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం కామారెడ్డిలో జరగనుంది. ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఇటీవల కామారెడ్డిలో తలెత్తిన పరిస్థితులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు పలు అంశాలపై బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

తాజా పరిణామాలపై...
అందుకే భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం కామారెడ్డిలో జరపాలని నిర్ణయించారు. సమావేశంలో న్యాయపరంగా కేసులను ఎదుర్కొనడంతో పాటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు అవసరమైన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం బీజేపీ శాసనసభ పక్ష బృందం బాన్సువాడకు వెళ్లనుంది.


Tags:    

Similar News