Telangana : నేడు రేవంత్ కలెక్టర్లతో భేటీ

తెలంగాణలో మొంథా తుపాను బీభత్సంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయనున్నారు

Update: 2025-10-30 02:19 GMT

తెలంగాణలో మొంథా తుపాను బీభత్సంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయనున్నారు. మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం నిన్న రాష్ట్రంపై పడింది. తెలంగాణలోని అనేక జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాల్లో పంటనష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. చేతికి వచ్చిన పంట నీళ్లపాలయింది.

తుపాను ప్రభావిత ప్రాంతాలకు...
ఖమ్మం, వరంగల్, ములుగు, సిద్ధిపేట జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. అనేక కాలనీలు నీట మునిగాయి. దీంతో సహాయక కార్యక్రమాలు చేపట్టాలని నిన్ననే ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే నేడు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆ జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకోనున్నారు. అవసరమైన సహాయక చర్యలను వెంటనే చేపట్టి బాధితులకు అండగా నిలవాలనికలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించనున్నారు.


Tags:    

Similar News