చంపేస్తామని వార్నింగ్‌ లు వచ్చేవి

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని రిటైర్డ్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు

Update: 2022-09-25 15:08 GMT

 ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని రిటైర్డ్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. యువత అందుకు నడుంబిగించాలని అన్నారు. డబ్బులు లేని ఎన్నికలు వచ్చినప్పుడే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. హరిత ప్లాజాలో జరిగిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారన్నారు. అవినీతి పరులే నిర్భయంగా తిరుగుతున్నారని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో అవినీతిని నిర్మూలించగలిగినప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుందని ఆయన అన్నారు.

యువత రాజకీయాల్లోకి....
అయితే తనకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు అనేక సార్లు బెదిరింపులు వచ్చాయన్నారు. లేఖలను రెడ్ ఇంక్ తో రాసి మరీ పంపి తనను భయపెట్టాలని చూసేవారన్నారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని లేఖలు తరచూ వచ్చేవని, అయితే తాను వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. భయపడకుండా తన విధులను నిర్వర్తించానని అన్నారు. రాజకీయాల్లోకి యువత ముందుకు రావాలన్నారు. యువత నడుంబిగించినప్పుడే సమస్యలు తొలగిపోతాయని, అవినీతి లేని సమాజాన్ని చూడగలమని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News