Telangana : మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి

Update: 2026-01-17 12:40 GMT

తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని పది మున్సిపల్ కార్పొరేుషన్లకు, , 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనుంది. దీంతో మరో నాలుగు రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశముంది.

గ్రేటర్ హైదరాబాద్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ అయింది. తెలంగాణలోని పది కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ-1, ఎస్టీ-1, బీసీ-3, జనరల్‌-5 గా ఖరారు చేశారు. 121 మున్సిపాలిటీలలో ఎస్సీ-17, ఎస్టీ-5, బీసీ-38, జనరల్‌-61 రిజర్వేషన్లు ఖరరాయ్యాయి. ఇక ఎన్నికలకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లే. షెడ్యూల్ మరో నాలుగు రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News