SLBC Tunnel Accdent : తవ్వకాలు జరపాలా? వద్దా? తేలని నిర్ణయం

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ నేటికీ కొనసాగుతుంది.

Update: 2025-04-25 04:14 GMT

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ నేటికీ కొనసాగుతుంది. సహాయక చర్యలు 63వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే దాదాపు 253 మీటర్ల రకు మట్టిని, బురదను, బండరాళ్లను సహాయక బృందాలు తొలగించాయి. ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకూ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే చివరి 43 మీటర్లు అత్యంత కీలకంగా మారింది. అయితే ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగించి మృతదేహాలను వెలికి తీసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఎందుకంటే మృతదేహాలను కూడా బంధువులకు అప్పగించలేకపోయామన్న అపప్రధను ప్రభుత్వం విపక్షాల నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుంచి ఎదుర్కొనాల్సి వస్తుంది.

ప్రమాదకరమైన జోన్ లో...
అయితే ఈ ప్రమాదకరమైన జోన్ లో ఎలా తవ్వకాలు జరపాలన్నదే అసలు సమస్య. అక్కడ తవ్వకాలు జరిపితే పైకప్పు మరోసారి విరిగిపడే అవకాశముంది. అక్కడ ఆక్సిజన్ అందకపోవడంతో ఇప్పటికే అక్కడి వరకూ ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. అదేసమయంలో మాన్యువల్ గా 43 మీటర్ల వద్ద తవ్వకాలు జరపాలా? లేదా? రోబోలను ఉపయోగించాలా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకుంటే మరయంత్రాలయితే మృతదేహాలు కానీ, అవశేషాలు కానీ ఛిద్రమయ్యే అవకాశాలున్నాయి. అదే మాన్యువల్ గా అయితే చాలా జాగ్రత్తగా మృతదేహాలను బయటకు తీయవచ్చన్న అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతుండటంతో ఇందుకోసం మరోసారి నిపుణుల సూచనలు తీసుకుని ముందుకు వెళ్లనున్నారు.
ఆ ప్రాంతంలో తవ్వకాలు...
ప్రమాదకరమైన ప్రాంతానికి ర్యాట్ హోల్ మైనర్లను పంపి తవ్వకాలు జరిపితే బాగుంటుందన్నఅభిప్రాయమూవ్యక్తమవుతుంది. అయితే వీరికితోడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ,సింగరేణి,హైడ్రా రెస్క్చూ టీంలు కూడా వెళ్లి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్లాలన్నఅభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోవడం కంటే ముందుగానే పరిస్థితిని అక్కడ అంచనా వేసి ఆ తర్వాతే తవ్వకాలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.దీంతో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొద్ది కాలం కొనసాగుతుందని, ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని అధికారులే చెబుతున్నారు.
Tags:    

Similar News