నేడు సీఎం వద్దకు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో సమర్పించనున్నారు.

Update: 2025-08-01 04:40 GMT

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో సమర్పించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నివేదికను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందచేయనున్నారు. నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉండే అవకాశముంది.

నిన్ననే సమర్పించినా...
నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాకి నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. మొత్తం 650 పేజీలతో నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో ఏముంది? ఏ విషయాలపై కమిషన్ అభ్యంతరం చెప్పిందన్న దానిపై నేడు, రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News