Telangana : ప్రముఖ రచయిత అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Update: 2025-11-10 02:38 GMT

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అందెశ్రీని కుమారులు ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఒక్కసారిగా ఇంట్లో పడి పోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాంధీ ఆసుపత్రికి...
అందశ్రీకి సరైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను ఆదేశించినట్లు తెలిసింది. అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారని తెలిసి అనేక మంది గాంధీ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందెశ్రీ రచించారు. జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్రానికి అందించారు. తెలంగాణ ఉద్యమ గీతాలను రచించారు. 


Tags:    

Similar News