హైదరాబాద్ - విజయవాడ హైవేపై వర్షపు నీరు

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మళ్ళీ వర్షపు నీరు చేరింది

Update: 2025-11-03 04:34 GMT

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మళ్ళీ వర్షపు నీరు చేరింది. చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద చెరువును తలపిస్తున్న 65 వ నెంబర్ జాతీయ రహదారి పై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రాత్రంతా వాహనదారుల నరకయాతన చూశారు. వరద దాటే క్రమంలో పలు వాహనాలు గుంతలు ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయిన వాహనాలు బయటకి తీసేందుకు వాహనదారులు,పోలీసుల తంటాలు పడాల్సి వస్తుంది.

నెమ్మదిగా సాగుతున్న వాహనాలు...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రైల్వే వంతెన కిందకు చేరుకోవడంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. కొన్ని వాహనాలు నీటిలోనే కూరుకుపోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతన్నారు. వాహనదారులకు హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవే సవాల్ గా మారింది. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని నీటిని తోడేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News