తెలంగాణాకు వర్షాలు

మరో ఐదురోజులపాటు వర్ష సూచన తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ వెల్లడించింది.

Update: 2023-08-23 15:04 GMT

తెలంగాణాకు వర్షాలు

మరో ఐదురోజులపాటు వర్ష సూచన

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు అధికారులు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ను జారీ చేశారు.జనగాం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగా రెడ్డి, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసాయి. వరంగల్‌లో 49.3 మిమీ, మహబూబాబాద్‌లో 32.3 మిమీ, నల్గొండలో 30.8 మిమీ వర్షపాతం నమోదైంది, హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షం కురిసింది. నానక్‌రాం గూడ, హైటెక్ సిటీ, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మణికొండ, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు, ట్యాంక్ బండ్, శేరిలింగంపల్లి, షేక్‌పేట్, అంబర్‌పేట్, నాంపల్లి, ఉప్పల్, ఆసిఫ్‌నగ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

Tags:    

Similar News