Hyderabad : హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మరో రెండు వందేభారత్ రైళ్లు
హైదరాబాద్ వాసులకు రైల్వే శాఖ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే మరో రెండు వందేభారత్ రైళ్లు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నాయి
హైదరాబాద్ వాసులకు రైల్వే శాఖ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే మరో రెండు వందేభారత్ రైళ్లు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నాయి. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు ఇప్పటికే వివిధ మార్గాల్లో కనెక్టివిటీ ఉంది. రహదారితో పాటు విమానయానం, రైళ్లలో అనేక మంది నిత్యం లక్షల సంఖ్యలో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. బిజినెస్ పీపుల్ మాత్రమే కాకుండా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఎక్కువగా ఈ మూడు ప్రయాణ సాధనాలను ఎంచుకుంటారు.
మొత్తం ఏడుకు చేరడంతో...
రైళ్లలో వందేభారత్ రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తిరుపతి, బెంగళూరు, నాగపూర్ లకు ఒక వందేభారత్ రైలు, విశాఖపట్నానికి రెండు రైళ్లు తిరుగుతున్నాయి. తాజాగా పూణె, నాందేడ్ ల మధ్య వందేభారత్ రైళ్లు రానున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ రైళ్ల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. నాంపల్లి నుంచి పూణెకు, చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి నాందేడ్ కు కొత్తగా వందేభారత్ రైళ్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో పట్టాలపై వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.