Telangana : మరో ఆర్టీసీ బస్సు కు ప్రమాదం
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. జాతీయ రహదారి 65 పై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి లోనైంది. ముత్తంగి గ్రామ సమీపంలో ముందు ఉన్న కార్లను తప్పించబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.
పటాన్ చెరు సమీపంలో...
మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎవ్వరికి ప్రమాదం జరగకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పటాన్ చెరు పోలీసులు తెలుసుకున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు పంపారు.