Telangana : పవన్ కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అంతేకాదు..క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టితగలడమేనని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ రకంగా స్పందించారు.
ఒక్క సినిమా కూడా విడుదల కాదంటూ...
తెలంగాణ ప్రజల దిష్టికాదని, ఆంధ్రపాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా చెబుతన్నా క్షమాపణలు చెప్పకుంటే పవన్ సినిమా తెలంగాణలో ఒక్క థియేటర్ లో కూడా విడుదల కాదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా అనుభవం లేకనే ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ చేస్తున్నారన్నారు.