Telangana : నేటి నుంచి కళాశాలల బంద్

తెలంగాణలో నేటి నుంచి ప్రయివేటు కళాశాలలు బంద్ జరుగుతుంది

Update: 2025-11-03 02:54 GMT

తెలంగాణలో నేటి నుంచి ప్రయివేటు కళాశాలలు బంద్ జరుగుతుంది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయీలను విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రయివేటు కళాశాలన్నీ బంద్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. దీపావళికి ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద బకాయీలను చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ప్రయివేటు కళాశాలల యాజమాన్యం చెబుతోంది.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయీలను...
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయీలను విడుదల చేయమని తాము కోరుతుంటే తమ కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుందని, దీనికి నిరసనగా తాము తెలంగాణ వ్యాప్తంగా ప్రయివేటు కళాశాలలను నేటి నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాము ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళతామని ప్రకటించాయి. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తు్న్నాయి.


Tags:    

Similar News