Telangana : నేటి నుంచి యథావిధిగా కాలేజీలు

తెలంగాణలో నేటి నుంచి యథావిధిగా ప్రయివేటు కళాశాలలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-09-16 04:29 GMT

తెలంగాణలో నేటి నుంచి యథావిధిగా కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం అవ్వడంతో నేటి నుంచి తెలంగాణలో ప్రయివేటు కళాశాలలు యధావిధిగా నడవనున్నాయి. తమకు చెల్లించాల్సిన పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయీలను చెల్లించాలని నిన్న ప్రయివేటు కళాశాలలను బంద్ చేశాయి.

చర్చలు సఫలం...
అయితే ప్రభుత్వం మాత్రం ప్రయివేటు కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపింది. వారంలో 600 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్న ప్రభుత్వం చెప్పింది. అలాగే దీపావళికి మరో 600కోట్ల రూపాయలను విడుదల చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ మేరకు కాలేజీల యాజమాన్యాలు సమ్మెను విరమించుకున్నట్లు ప్రకటించాయి.


Tags:    

Similar News