Telangana : నవంబరు 3 నుంచి కళాశాలల బంద్

తెలంగాణలో నవంబరు 3వ తేదీ నుంచి ప్రయివేటు కళాశాలలు బంద్ కానున్నాయి

Update: 2025-10-20 01:53 GMT

తెలంగాణలో నవంబరు 3వ తేదీ నుంచి ప్రయివేటు కళాశాలలు బంద్ కానున్నాయి. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు వృత్తి విద్యాకళాశాలలు నవంబరు 3వ తేదీ నుంచి బంద్ పాటించనున్నట్లు ప్రయివేటు కళాశాలల అసోసియేషన్ తెలిపింది. ఈ నెల 22వ తేదీన ప్రభుత్వానికి బంద్ నోటీసును అందచేస్తామని చెప్పింది.

ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలు...
ప్రయివేటు కళాశాలల అసోసియేషన్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో నవంబరు 3వ తేదీ నుంచి కళాశాలలను బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25వ తేదీన విద్యార్థి సంఘాలతో, 26వ తేదీన సర్వసభ్య సమావేశాలు నిర్వహించనున్నారు. నవంబరు 1 తేదీన అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.


Tags:    

Similar News