రెండు కిలోమీటర్ల ఎత్తులో విహరించడం గొప్ప అనుభూతి : రాష్ట్రపతి

ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి..

Update: 2023-06-17 07:14 GMT

dundigal airforce academy

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శనివారం దుండిగల్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు త్రివిధ దళాల అధినేత్రి హోదాలో రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలన్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని అన్ని శాఖల్లోనూ మహిళా అధికారులను కూడా రిక్రూట్ చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భవిష్యత్తులో మహిళా ఫైటర్ పైలట్ల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ లో తాను సుఖోయ్ 30 ఎంకేఐ ఫైట‌ర్ జెట్‌లో విహ‌రించిన‌ విషయాన్ని వెల్లడించారు. సుమారు 30 నిమిషాల పాటు సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 800 కిలోమీటర్ల వేగంతో విహరించి బ్రహ్మపుత్రి, తేజ్ పూర్ లోయలు, హియాలయాల అద్భుతాలను వీక్షించినట్లు తెలిపారు. అది తనకు గొప్ప అనుభూతినిచ్చినట్లు ముర్ము చెప్పారు.









Tags:    

Similar News