గర్భిణి మృతి కామినేని హాస్పిటల్‌కు కోటి ఫైన్
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ లో గర్భిణి చనిపోయిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం మృతురాలి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
భారత మహిళల క్రికెట్ జట్టుకు త్వరలోనే తొలిసారిగా విదేశీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రానున్నారు. ఈ పదవి కోసం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్న నాథన్ కీలీతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు సఫలమైతే భారత మహిళల జట్టుకు పనిచేయనున్న తొలి విదేశీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా కీలీ నిలుస్తారు. ప్రస్తుతం భారత మహిళల జట్టుకు ఏఐ హర్షా కోచ్‌గా ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో జట్టు అద్భుతమైన ఫిట్‌నెస్ సాధించి, ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, హర్షా సేవలను బీసీసీఐ మరో అసైన్‌మెంట్‌కు ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నాథన్ కీలీ నియామకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.