Telangana : ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే?

తెలంగాణాలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

Update: 2025-11-03 03:26 GMT

తెలంగాణాలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.

కంకర లోడు తో ఉన్న...
కంకర లోడు తో ఉన్న టిప్పర్ రోడ్డు రాంగ్ రూట్లో వచ్చి బస్సు ను ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. హుటాహుటిన ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బాధితులకు అవసరమైన సత్వర సాయాన్ని అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికత్స అందచేయాలని కోరారు.


Tags:    

Similar News