కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి: మంత్రి పొన్నం
సింగరేణిపై బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు
సింగరేణిపై బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ముప్ఫయి శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఎంతో అవినీతి జరిగినట్లు కవిత అన్నారని, ఆమె ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానం ఇవ్వలేదన్నారు.
హిల్ట్ పాలసీపైన కూడా...
హిల్ట్ పాలసీలపైనా ఇలాగే ఆరోపణలు చేశారని, అసెంబ్లీలో చర్చ పెడితే బహిష్కరించి వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పుడు సింగరేణి బొగ్గుగనులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పెద్దయెత్తున జరిగిందని కవిత ఆరోపించారని, కాళేశ్వరం విషయంలోనూ, మిగిలిన ప్రాజెక్టులల్లోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై స్పందిస్తే బాగుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.