Ponguleti : ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఏమన్నారంటే?

తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు

Update: 2025-10-13 11:55 GMT

తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. తాను డెబ్భయి కోట్ల రూపాయలకు కక్కుర్తిపడే వాడిని కానని అందరికీ తెలుసునని తెలిపారు. మేడారం పనుల్లో తనపై వస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఆరోపణలు చేసే వారికి కూడా ఈ విషయం తెలుసునని చెప్పారు. తన ముందున్న కర్తవ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన పనిని పూర్తిచేయడమే లక్ష్యమని వివరించారు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అందరినీ కలుపుకుని ...
తాను అందరినీ కలుపుకుని ముందుకు వెళతతానని, మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోనే కలసి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే పత్రికల్లో వస్తున్న వార్తలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన మీడియాకు చెప్పారు. తానేంటో.. తన కంపెనీ ఆర్థిక స్థోమత ఏంటో అందరికీ తెలుసునన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో తాను ఎవరికీ జవాబు చెప్పేందుకు కానీ, విమర్శలకు సమాధానం చెప్పే అవసరం కానీ తనకు లేదని తెలిపారు.


Tags:    

Similar News