Telangana : నేడు తెలంగాణ పాలిసెట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమయినా?

తెలంగాణలో నేడు పాలిసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమయినా అనుమతించబోమని అధికారులు తెలిపారు

Update: 2025-05-13 04:04 GMT

తెలంగాణలో నేడు పాలిసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమయినా అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ తో పాటు నాన్ ఇంజిరీరింగ్ డిప్లొమా కోర్సులకు సంబంధించిన వాటతో పాటు, వెటర్నరీ, ఉద్యానవన, అగ్రికల్చరల్ ప్రవేశానికి పరీక్షలు జరగనున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా...
ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 1.06 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం అధికారులు 276 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందు నుంచే అంటే పది గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు.


Tags:    

Similar News