ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Update: 2025-07-20 04:00 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇది రెండో నోటీసు. మొదటి నోటీసుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించకపోవడంతో రెండోసారి సిట్ అధికారులు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో అనుకూలమైన సమయంలో సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

రెండోసారి నోటీసులు...
అయితే విచారణకు వచ్చే తేదీని, సమయాన్ని ముందుగానే దర్యాప్తు అధికారి తెలియజెప్పాలని సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ వాంగ్మూల్మాన్ని నమోదు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన నోటీసులు జారీ చేసినా ప్రవీణ్ కుమార్ హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News