తెలంగాణలో వడదెబ్బకు ఎనిమిది మంది మృతి
ప్రజలు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ఎండదెబ్బకు తాళలేక అనేక మంది వడదెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నారు
ap weather update, ap weather news
రోహిణికార్తెలో ఎండలు భగ్గుమంటున్నాయి. ప్రజలు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ఎండదెబ్బకు తాళలేక అనేక మంది వడదెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నారు. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు.
నిన్న ఒక్కరోజే...
తెలంగాణలో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది వడదెబ్బ కారణంగా మరణించారు. వరంగల్ జిల్లాలో వడదెబ్బకు ముగ్గురు మృతి చెందగా, నల్లగొండ జిల్లాలో ఇద్దరు మరణించారు. కరీనంగర్ జిల్లాలో ఒకరు మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు మరణించారు. ప్రజలు ఈ ఎండలకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.