Congress : వీహెచ్ పై హైకమాండ్ సీరియస్
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుపై పార్టీ అధినాయకత్వం సీరియస్ అయినట్లు తెలిసింది
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుపై పార్టీ అధినాయకత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. వీహెచ్ నివాసంలో మున్నూరు కాపుల సమావేశం జరగడం, దానికి విపక్ష నేతలు హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా వీహెచ్ పార్టీ లైన్ ను కాదని తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించింది.
ఫిర్యాదులు వెళ్లడంతో...
దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో వి. హనుమంతరావు పార్టీ అధినాయకత్వం వివరణ కోరినట్లు తెలిసింది. ఎందుకు సమావేశం కావాల్సి వచ్చిందని? ఇది పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పంపడం కాదా? అని ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా వీహెచ్ విషయంలో కొంత సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు.