Breaking : తెలంగాణ నేతలకు షాకిచ్చిన హైకమాండ్.. అధికారిక ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజ్యసభ పదవిని అభిషేక్ మను సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది
abhishek manu singhvi, rajya sabha, congress, telangana
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజ్యసభ పదవిని అభిషేక్ మను సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది. ఆయనను ఎంపిక చేసినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్విని ఎంపిక చేయడంతో స్థానిక కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
కేకే రాజీనామాతో...
తెలంగాణలో కె.కేశవరావు రాజీనామా చేయడంతో రాజ్యసభ ఉప ఎన్నిక జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ పదవి కోసం అనేక మందినేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేయడంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలను కాదని హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.