Telangana : వనజీవి రామయ్య ఇకలేరు

పద్మశ్రీ వనజీవి రామయ్య మరణించారు. శనివారం తెల్లవారు జామున ఆయన గుండెపోటుతో మరణించారు

Update: 2025-04-12 02:03 GMT

పద్మశ్రీ వనజీవి రామయ్య మరణించారు. శనివారం తెల్లవారు జామున ఆయన గుండెపోటుతో మరణించారు. ఖమ్మంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లోనే ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొక్కల ప్రేమికుడిగా పేరుగాంచిన రామయ్య మొక్కలను నాటడం, వాటిని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఆయన తన పేరును వనజీవిగా మార్చుకున్నారు.

గుండెపోటుతో...
మొక్కలప్రేమికుడు వనజీవి రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఆయన తన జీవిత కాలంలో ఎన్నో లక్షల మొక్కలు నాటారు. పర్యావరణం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తారు. అంతేకాదు.. ఆయన చేసిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రివార్డులు, అవార్డులు కూడా అందచేసింది.


Tags:    

Similar News