Telangana : ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది
తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఇరవై తేదీ లోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధకారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మున్సిపల్ ఎన్నికలపై సంసిద్ధత తెలియజేసింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గడువు ముగిసిన...
తెలంగాణలో ఇప్పటికే 117 మున్సిపాలిటీల పాలకవర్గాలకు గడువు ముగిసింది. దీంతో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమయింది. అయితే సంక్రాంతి సెలవులు తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని కూడా చెబుతున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.