Telangana : రెండింటికీ విడివిడిగా నోటిఫికేషన్

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. రెండు పదవులకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది

Update: 2024-01-11 07:22 GMT

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. రెండు పదవులకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈనెల 18 వతేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. 19వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 22వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 29న పోలింగ్ జరగనుంది.

కాంగ్రెస్‌కే లాభం...
అదే రోజున ఫలితాలు వెల్లడవుతాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు రాజీనామా చేయడంతో ఈ ఖాళీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో కాంగ్రెస్ కు లబ్ది చేకూరనుంది. దీనికి బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతుంది. కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.


Tags:    

Similar News