Telangana : నేటి నుంచి నామినేషన్లు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
తెలంగాణలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ నేడు విడుదలయింది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరణ కార్యక్రమం ఉంటుంది
తెలంగాణలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ నేడు విడుదలయింది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో జిల్లా అధికారుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ముందుగా 31 జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 11వ తేదీ వరకూ నామిషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 12వ తేదీన నామినేషన్ల ను పరిశీలిస్తారు. పదిహేనో తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 292 జడ్పీటీసీ స్థానాలకు, 2,963 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది.
సరిచూసుకుని వేయాలి...
అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్ వేసే అభ్యర్థులు సక్రమంగా తమ నామినేషన్ పత్రాలు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాలను వేసే ముందు అన్ని పత్రాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. స్క్రూటినీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందే అన్ని రకాలుగా, అవసరమైతే న్యాయవాదుల అభిప్రాయంతో ఒకసారి సరి చూసుకుని వేయాలని కోరుతున్నారు. లేకుంటే అనవసరంగా నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురవుతాయని, అప్పుడు ఎవరినీ నిందించి లాభం లేదని అధికారులు చెబుతున్నారు.
నామినేషన్ పత్రాల్లో...
వయస్సు 21 సంవత్సరాలు నిండాలి
ఓటరు జాబితాలో ఓటరు గా నమోదై ఉండాలి.
ఎస్.సి, ఎస్టీ, బీసీ సామాజికవర్గం వారైతే కుల ధృవీకరణ పత్రం నామినేషన్ కు జత పరచాలి.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
నేర చరిత్ర,, స్తిర, చర ఆస్తులు, విద్యార్హత లతో కూడిన అఫిడవిట్ లతో ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
ఎన్నికల వ్యయాన్ని నిర్దేశించన మేరకే చేస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.
ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి, లేకపోతే పార్టీ బీ పారం ఇచ్చినప్పటీకీ పార్టీ గుర్తు కేటాయించరు
ఒక్కొక నామినేషన్ పత్రం లో ఒక్క పార్టీ పేరు మాత్రమే రాయాలి. మొత్తం నాలుగు నామినేషన్ లో వేరు వేరుగా నాలుగు పార్టీ ల పేర్లు రాయొచ్చు.ఏ పార్టీ బీ ఫారరం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణనించి గుర్తు కేటాయిస్తారు.
ఏదైతే స్థానం నుంచి పోటి చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి. ఎంపీటీసీకి ఆ మండలంలోని ఓటర్ అయితే సరిపోతుంది. జడ్పిటిసికి పోటీ చేసే అభ్యర్థికి జిల్లాలో ఎక్కడైనా ఓటు ఉంటే సరిపోతుంది.
అఫిడవిట్ లో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలి
బ్యాంక్ ఎకౌంటును జత చేయాలి.
ఎన్నికల అధికారి ఇచ్చే నామినేషన్ చెక్ లిస్టును తీసుకొవాలి. వారు ఏమైనా ఆ లిస్టులో పేర్కొన్నవి ఇవ్వలేదంటే వాటిని నిర్ణయించిన సమయంలో ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదు. చేస్తే నామినేషన్ పేపర్స్ ను తిరస్కరిస్తారు.
ప్రతిదీ ఒకటికి రెండుసార్లు నామినేషన్ పేపర్స్ ను చెక్ చేసుకుని వెయ్యాలి. అభ్యర్థి, సాక్షుల సంతకాలు ఉన్నచోట సంతకాలను చెక్ చేయాలి.