ప్రియురాలితో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌

గ్రామానికి సర్పంచ్‌ అవ్వాలని అనుకున్నాడు ఆ యువకుడు. ఎన్నికలు వచ్చేసినా రిజర్వేషన్‌ అనుకూలించలేదు.

Update: 2025-12-01 14:15 GMT

గ్రామానికి సర్పంచ్‌ అవ్వాలని అనుకున్నాడు ఆ యువకుడు. ఎన్నికలు వచ్చేసినా రిజర్వేషన్‌ అనుకూలించలేదు. ఆ యువకుడు ప్రెసిడెంట్‌ భర్తనైనా అవుదామనే ఆలోచనతో తన ప్రేయసితో నామినేషన్‌ వేయించేశాడు.ఆ యువతిని పెళ్లి కూడా చేసేసుకున్నాడు. సంగారెడ్డి మండలం తాళ్లపల్లికి చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోగా ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో చంద్రశేఖర్‌ తన ప్రియురాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజతో నామినేషన్‌ వేయించాడు. అనంతరం శ్రీజను పెళ్లి చేసుకున్న చంద్రశేఖర్‌ గౌడ్‌ తమకు రక్షణ కల్పించాలంటూ సంగారెడ్డి రూరల్‌ పోలీసులను ఆశ్రయించాడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News