గ్యాంగ్ రేప్ పై మహిళ కమిషన్ సీరియస్

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయింది

Update: 2022-06-07 12:26 GMT

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. నిందితులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని జాతీయ మహిళ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు జాతీయ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. దీంతో పాటు బాధిత బాలిక వీడియోలను సోషల్ మీడియలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆ వీడియోలను తక్షణం తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరింది.

వారంలో నివేదిక.....
హైదరాబాద్ లో మహిళలు, బాలికపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని జాతీయ మహిళ కమిషన్ ఆందో్ళన వ్యక్తం చేసింది. వారం రోజుల్లో ఐదు సంఘటనలు జరిగాయని, మహిళల భద్రతపై అనుమానాలు కల్గుతున్నాయని ఆవేదన చెందింది. మహిళల భద్రత, నేరాల నియంత్రణకసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది.


Tags:    

Similar News