Narendra Modi : తెలంగాణ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రధాని మోదీ తెలియజేశారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని మోదీ అన్నారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించిందని చెప్పారు.
బాధితులకు పరిహారం...
ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో మరణించడం బాధకలిగిస్తుంందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.