మంత్రి పదవి కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తా
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తన నియోజకవర్గం కోసం ఎంత త్యాగమైనా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
మునుగోడు ప్రజల కోసం...
ఆర్.ఆర్.ఆర్ భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆలస్యమైనా సరే పర్వాలేదు.. ఎదురుచూస్తానని తెలిపారు. తాను మాత్రం కాంగ్రెస్ లో ఉండి మునుగోడు నియోజకవర్గాల ప్రజల కోసం పోరాడతానని -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.