Telangana : మరోసారి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మంత్రి పదవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మంత్రి పదవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ తనకు మంత్రి పదవి ఇచ్చిన హామీని అధినాయకత్వం మాత్రం అమలు చేయడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి రహిత పాలనను...
అయితే తనను రాష్ట్రంలోని ముఖ్యనేతలే అడుగడుగునా అవమానిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కానీ ఇటీవల భట్టి విక్రమార్క తనకు మంత్రి పదవి విషయంలో వివరించడం సంతోషకరమని అన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రభుత్వం అవినీతి రహిత పాలనను మాత్రమే అందించాలని కోరుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సమాజం ఆంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండలని ఆయన ఆకాంక్షించారు