Manda Krishna Madiga : మందకృష్ణ మాదిగ కట్టడాల కూల్చివేత
వరంగల్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చారు.
వరంగల్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చారు. హంటర్ రోడ్డులో ఉన్న తమకు చెందిన 400 గజనాలను మందకృష్ణతో పాటు మరో ఇద్దరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయలేదని, తన భూమిని ఇంకా ఆక్రమించి ఉన్నారంటూ నంబూరి చారుమతి అనే మహిళ జాతీయ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
ఆక్రమించి నిర్మించారని...
అధికారులు దీనిపై విచారించి ఇది అక్రమ కట్టడాలుగా తేల్చారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సయితం ఈ నెల 24వ తేదీ లోపు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించింది. దీనిపై మంద కృష్ణ మాదిగ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలంటూ హైకోర్టుును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆ కట్టడాలను కూల్చివేశారు