Telangana : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే?
ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది.
ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
రెండు మూడు రోజుల్లో షెడ్యూల్...
ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశముంది. మూడురోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుత పద్ధతిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధత తెలియచేయడంతో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది.