అసలు నువ్వెవరు? ప్రకాష్ రాజ్‌కి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణ ఉద్యమంలో నిన్నెక్కడా చూడలేదే. అసలు నువ్వెవరు అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క విరుచుకుపడ్డారు.

Update: 2022-05-07 09:23 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌కి సన్నిహితుడిగా మారిన సినీనటుడు ప్రకాష్ రాజ్ సైతం రాహుల్‌ని ఉద్దేశించి ఘాటు ట్వీట్ చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి లేరని.. ఓ రాజా ఉన్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందించారు. తెలంగాణలో దార్శనికత ఉన్న నాయకుడు కేసీఆర్ ఉన్నారని.. కొంతమంది ఫూల్స్‌ని పెట్టుకుని మీరేం చేస్తారో చెప్పాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఫూల్స్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా స్పందించారు. అసలు నువ్వెవరని ఆమె సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో నిన్నెక్కడా చూడలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ నేతలను ఫూల్స్ అంటున్న ప్రకాష్ రాజ్.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాంగ్రెస్ నేతలేనని గుర్తుంచుకోవాలన్నారు. హద్దుల్లో ఉంటే మంచిదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అంతకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలు వినే ముఖ్యమంత్రి లేరని.. ఓ రాజా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ.15 వేలు, రెండు లక్షల రుణమాఫీ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్‌ని విమర్శిస్తూ రాహుల్ చేసిన ట్వీట్‌కి ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలను ఫూల్స్ అంటూ సంబోధించడంతో శివంగి సీతక్క ఘాటు రిప్లై ఇచ్చారు.



Tags:    

Similar News