BJP : బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై లక్ష్మణ్ ఏమన్నారంటే?

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-06-01 12:00 GMT

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. విలీనం అనే అంశం ఎప్పుడూ చర్చకు రాలేదని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్‌ తెలిపారు.బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు నడుస్తోందన్న లక్ష్మణ్‌ ఆపరేషన్‌ సింధూర్‌పై ఆరోపణలు ఆర్మీని అవమానించడమేనని అని అభిప్రాయపడ్డారు. సైనికులను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ పై...
ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌ వ్యాఖ్యలు సరికాదని డాక్టర్ లక్ష్మణ్‌ అన్నారు. తెలిసి తెలియకుండా చేసే వ్యాఖ్యలు భారత సైన్యాన్ని మాత్రమే కాకుండా దేశ ప్రతిష్టను కూడా దిగజారుస్తాయని, మిగిలిన దేశాలలో భారత్ చులనగా మారుతుందని గుర్తు చేశారు. 2026లో మోదీ నాయకత్వంలో కులగణన జరుగుతుందన్న బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్‌ కులగణనను కాంగ్రెస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని అన్నారు.


Tags:    

Similar News