కొత్త చీర కంటపడితే ఆగలేని కూతురు.. తల్లి సపోర్ట్.!
కొందరికి డబ్బు పిచ్చి. మరికొందరికి చీరలు.. బంగారంపై మోజు. ఏదైనా హద్దు దాటితే మాత్రం అనర్థమే. ఇలా జైలుపాలవ్వాల్సిందే.
others
మహిళలకు చీరలు.. బంగారంపై మోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీరువాల నిండా చీరలున్నా బయటికి వెళ్లాలంటే కట్టేసిన చీర మళ్లీ కట్టుకోకూడదంటారు మరి! ఇక బంగారం గురించి చెప్పాలంటే.. పక్కింటావిడ ఏం చేయించుకుంది, ఎదురింటావిడ మెడలో ఏముందనే విషయాలకే అధిక ప్రాధాన్యం. అవి కావాలని ఇంట్లో మగాళ్లను సాధించడం కూడా మామూలే. కానీ అవి ఎలాగూ మనం కొనలేమని కొట్టేయాలనుకుంటేనే చివరికి కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఒకావిడ చీరల పిచ్చి చివరికదే చేయించింది. ఖరీదైన చీరలు కట్టుకోవాలన్న ఆశతో చోరీలు చేసి అడ్డంగా దొరికిపోయింది. చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరింది.
హైదరాబాద్‌లో వెలుగుచూసిన కిలాడీ లేడీ కేసు వివరాలు.. నగరంలోని అంబర్‌పేట సలీంనగర్‌కి చెందిన నల్లూరి పావనికి కొత్త చీరలంటే విపరీతమైన ఇష్టం. ఖరీదైన చీరలు కట్టుకోవాలని కోరుకునేది. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రం అందుకు సహకరించేది కాదు. కొత్త చీరలపై పిచ్చి ముదిరిన ఆమె చివరికి చోరీలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె తల్లి సుజాత సాయం తీసుకుంది. ఖరీదైన షోరూంలకు కస్టమర్లలా వెళ్లి కొత్త చీరలు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారు.
వారం రోజుల కిందట జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ కాస్ట్‌లీ షోరూంకి వెళ్లారు తల్లీకూతుళ్లు. అక్కడి సేల్స్‌మ్యాన్ కళ్లుగప్పి రూ.1.1 లక్షల విలువైన చీరలను కొట్టేసి అక్కడి నుంచి ఉడాయించారు. అదే రోజు రోడ్ నంబర్ 10లోని మరో షోరూంలో ఏకంగా రూ.2.8 లక్షల విలువైన ఖరీదైన చీరలను చోరీ చేసి పరారయ్యారు. విషయంగా ఆలస్యంగా గుర్తించిన షోరూం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో తల్లీకూతుళ్ల బాగోతం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కిలాడీ లేడీలను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.