అశ్రునయనాలతో తల్లీకూతుళ్ల అంత్యక్రియలు

కర్నూల్ జిల్లాలో ప్రైవేట్​ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి, చందన అంత్యక్రియలు వారి స్వగ్రామం మెదక్ మండలం శివ్వాయిపల్లిలో జరిగాయి.

Update: 2025-10-28 15:30 GMT

కర్నూల్ జిల్లాలో ప్రైవేట్​ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి, చందన అంత్యక్రియలు వారి స్వగ్రామం మెదక్ మండలం శివ్వాయిపల్లిలో జరిగాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం డెడ్​బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నూల్​ నుంచి అంబులెన్స్​లో డెడ్​బాడీలు శివ్వాయిపల్లికి చేరుకుంది. తల్లీకూతుళ్లకు ఒకేసారి తండ్రి, కొడుకులు ఆనంద్​ గౌడ్, శ్రీవల్లభ తల కొరివి పెట్టడం గ్రామస్తులను కంట తడి పెట్టించింది. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు తరలివచ్చారు.

Tags:    

Similar News