600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయట!!
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది.
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. దాదాపు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ బాధితులు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. ప్రభాకర్‌రావుతో పాటు నలుగురు నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్ భావిస్తోంది. ప్రతి రోజు ఉదయం 2గంటల పాటు ప్రభాకర్‌రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చే వారని నలుగురు నిందితులు సిట్ అధికారులకు తెలిపారు. పొంగులేటి, రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు.