Telangana మంత్రిగా అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు..
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రమంత్రిగా అజారుద్దీన్ ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించార. . మంత్రి వర్గ విస్తరణకు అవసరమైన ఏర్పాట్లు రాజ్ భవన్ లో చేశారు.
రాజ్ భవన్ లో జరిగిన...
అజారుద్దీన్ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాజభవన్ లో జరిగే మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రులకు ఆహ్వానం కూడా అందింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు లేనందున అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ హైకామండ్ నిర్ణయించడంతో్ నేడు ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజారుద్దీన్ కు మైనారిటీ శాఖను అప్పగించే అవకాశముంది.